బుడ్డోళ్ల బూతులు.. నోటికి ప్లాస్టర్ అంటించిన టీచర్ - MicTv.in - Telugu News
mictv telugu

బుడ్డోళ్ల బూతులు.. నోటికి ప్లాస్టర్ అంటించిన టీచర్

December 8, 2018

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచరే వికృత చేష్టలకు పాల్పడింది. అల్లరి చేస్తే వద్దని చెప్పాల్సింది పోయి, అభం శుభం తెలియని చిన్నారుల నోటికి ప్లాస్టర్ వేసింది. హరియాణాలోని గుర్‌గావ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది.

నాలుగేళ్ల వయస్సున్న బాలుడు, బాలిక ఇద్దరు ప్రైవేటు పాఠశాలలో ప్రీ నర్సరీ చదువుతున్నారు. తరగతి గదిలో పాఠాలు టీచర్ పాఠాలు చెబుతున్న సమయంలో వీరిద్దరు అల్లరి చేస్తున్నారని భావించిన టీచర్.. వీరి నోటికి ప్లాస్టర్ వేసింది. దీనిపై ఆ టీచర్ మాట్లాడుతూ.. ‘ నేను పాఠాలు బోధిస్తున్న సమయంలో వీరిద్దరూ అల్లరి చేస్తున్నారు. అంతేకాదు క్లాస్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. బూతులు కూడా మాట్లాడుతున్నారు’ అని పేర్కొంది.

విషయం తెలుసుకున్న విద్యార్థులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పాఠశాల మేనేజ్‌మెంట్ సదరు ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.