కామగురువుకు దేహశుద్ధి.. - MicTv.in - Telugu News
mictv telugu

కామగురువుకు దేహశుద్ధి..

April 12, 2018

విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడికి కామంతో కళ్లు మూసుకుపోయాయి. తన పిల్లల వయసున్న విద్యార్థినులపై  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నార్ మండలం పెద్ద ఎక్లారాలో జరిగింది.

గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న విజయ్ అమ్మాయిలను వేధిస్తున్నాడు. విద్యార్థినులకు ప్రేమ ఒలకబోస్తూ లేఖలు రాశాడు. అంతటితో ఆగకుండా విద్యార్థులను లైంగిక వేధించాడు. అతగాడి వేధింపులను భరించలేక విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. విద్యార్థులు,తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ విజయ్‌ని చితక్కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని స్టేషన్‌కు తరలించారు.