mictv telugu

విరాట్ పుట్టిన రోజు వేడుకలు ఎక్కడో తెలుసా?

November 5, 2018

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మనోడి ఆట ఎంతో మంది అభిమానులను కట్టిపడేసింది. విరాట్ క్రీజ్‌లో ఉన్నంత సేపు స్కోర్ బోర్డును ఉరుకులు పరుగులు పెట్టిస్తాడు. ప్రతి బంతిని బౌండరీకి పంపి బౌలర్లకు ముచ్చెమటలు పుట్టిస్తాడు.29 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ నేడు 30వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా తన జన్మదిన వేడుకను భార్య అనుష్క శర్మతో కలిసి హరిద్వార్‌లో  జరుపుకోబోతున్నాడు. ఇందుకోసం శనివారం రాత్రే డెహ్రాడూన్ చేరుకున్నాడు. వీరిద్దరూ నవంబర్ 7వ తేదీ వరకు హరిద్వార్‌లోనే గడపనున్నారు. అక్కడి నుంచి రిషికేష్ వెళ్లి ఓ రోజు ఉండనున్నారు.Telugu News Team India Captain Virat Kohli Set To Celebrate 30th Birthday In Haridwar Ashram With Wife Anushka Sharmaహరిద్వార్‌లోని అనంత్‌ధామ్ ఆత్మబోధ్ ఆశ్రమంలో కోహ్లీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నాడు. ఆశ్రమ యజమాని మహారాజ్ అనంత్ బాబా అనుష్క శర్మ కుటుంబ ఆధ్యాత్మిక గురువు. అందుకే అక్కడే కోహ్లీ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. వీరి రాకను తెలుసుకున్న స్థానిక అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. కోహ్లీ అనుష్క ఈ ఆశ్రమానికి రావడం రెండోసారి. కోహ్లీతో పెళ్లికి ముందు ఆశ్రమాన్ని సందర్శించిన అనుష్క అనంత్ బాబా ఆశీర్వాదాలు తీసుకుంది.

1988 నవంబర్ 5వ తేదీన కోహ్లీ ఢిల్లీలో జన్మించారు. విరాట్ తల్లిదండ్రులు ప్రేమ్ కోహ్లీ, తల్లి సరోజ్ కోహ్లీ. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి ఉన్న కోహ్లీ.. 2006 నవంబర్‌లో తమిళనాడుకు వ్యతిరేకంగా రంజీ ట్రోఫి మ్యాచ్‌లో ఆరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2008లో కెప్టెన్‌గా వ్యవహరించి అండర్ 19 ఐసీసీ ప్రపంచ కప్పు అందించాడు.