కన్నీటితో క్రికెట్‌కు వీడుకోలు - MicTv.in - Telugu News
mictv telugu

కన్నీటితో క్రికెట్‌కు వీడుకోలు

March 31, 2018

బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో డేవిడ్ వార్నర్ సహా స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లపై ఆస్ట్రేలియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ తన క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేస్తూ, క్రికెట్ అభిమానులకు క్షమాపణలు చెప్తూ కన్నీటి పర్యంతం అయ్యాడు. సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. ‘ దేశం పరువు తీసే పని చేశాను. ఆ చెత్త పనిలో నా హస్తం వుంది కాబట్టే నాకీ శిక్ష పడింది. ఇప్పుడు దీని గురించి మాట్లాడటం నాకు చాలా సిగ్గు చేటుగా వుంది. 12 నెలల నిషేధం తర్వాత నేను ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడకపోవచ్చు. నేను చేసిన పని క్షమించరానిది ’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. నిషేధం తర్వాత ఏదో ఒక రోజు మళ్లీ జట్టుకు ఆడే గౌరవం దక్కుతుందన్న చిన్న ఆశ వుందన్నాడు. కానీ తనకు మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం వచ్చినా తప్పుకొంటాను అని వార్నర్ అన్నాడు. ఓ కఠినమైన మార్పు కోసం నిపుణుల సలహా తీసుకుంటానని, ఆ తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పాడు.కాగా స్మిత్ కన్నీటి పర్యంతం అవటాన్ని చూసి బాలీవుడ్ హీరో వరుణ్ థావన్ తన ట్విటర్ ద్వారా సానుభూతి వ్యక్త పరిచాడు.‘ స్మిత్‌ను క్రికెట్ అభిమానులు తప్పక క్షమిస్తారని నేను భావిస్తున్నాను. స్మిత్‌ని చూస్తుంటే…చేసిన పొరపాటుకు అతను పశ్చాత్తాపానికి మించి కుమిలిపోతున్నాడు ’ అని థావన్ చెప్పుకొచ్చాడు.