కన్నీరు-పన్నీరు.. నాగబాబుగారూ హ్యాట్సాఫ్.. వర్మ

టాలీవుడ్‌లో ఇప్పుడు బాలకృష్ణ, నాగబాబుల వార్ నడుస్తోంది. బాలయ్య మాట్లాడిన మాటలకు ధీటుగా సమాధానం చెప్తూ వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు నాగబాబు. బ్లడ్, బ్రీడ్  అన్న బాలయ్యకు, నాగబాబు గట్టి కౌంటరే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనాగబాబు వీడియోలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్‌లో తనదైన శైలిలో స్పందించారు.Telugu news Tears-Perfume .. Hatsof to you Naga Babu .. Varma tweet‘కామెంట్లు చేయ‌డంలో న‌న్ను మించిపోయార‌నే నా జెలసీ బాధ ఒక‌వైపు. త‌న స్టార్ బ్ర‌ద‌ర్స్‌ను రక్షించుకోవడంలో సూప‌ర్‌స్టార్ అయిపోయార‌న్న ఆనందం ఒకవైపు. ఒక కంట క‌న్నీరు, మ‌రో కంట ప‌న్నీరు. నాగ‌బాబు గారూ హ్యాట్సాఫ్‌.. మీ సోద‌రుల‌ను మీరు ఎంత‌గా ప్రేమిస్తున్నారో మేము కూడా అంతే ప్రేమిస్తున్నాం’ అని ట్వీట్ చేస్తూ నాగబాబు మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు. ఇదిలావుండగా నాగబాబు వీడియోలపై బాలకృష్ణను విలేకరులు వివరణ అడగగా నో కామెంట్ అని చిన్నగా సమాధానం చెప్పి దాటవేశారు.