mictv telugu

అక్కడ అంతే.. కౌగిలించుకున్నారని..

February 1, 2019

గల్ఫ్ దేశాల్లో ఆడవారిపై ఆంక్షలు ఎక్కువ. రోడ్లపై ఆడా, మగా కాస్త సన్నిహితంగా కనిపిస్తే చట్టాలు ఓర్చుకోవు. ఇండోనేసియాలోనూ అంతే. కొన్ని చట్టాలు చాలా దారుణంగా ఉంటాయి. చట్టం దృష్టిలో నేరంగా భావించేలా ప్రవర్తిస్తే శిక్షతోపాటు పరువు తీసేలా దండిస్తారు పోలీసులు, మతపెద్దలు.

Telugu News Teenagers are thrashed for having a cuddle Woman, 18, and her boyfriend are whipped with a bamboo cane in public for breaching Indonesias strict Sharia law.

ఏం జరిగింది?

అస్హ్ రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసున్న ప్రేమికులు కౌగిలించుకున్నారు. ఇది చూసిన అధికారులు గయ్యిమన్నారు. ఆ జంటను మొదట జైల్లో బంధించి, తర్వాత బహిరంగంగా  శిక్షించారు. అందరూ చూస్తుండగా వీపులపై బెత్తంతో కొట్టారు.

ఇండోనేషియాలో షరియా లా ప్రకారం పబ్లిక్‌గా హగ్  చేసుకోవడం నిషిద్ధం. అలా చేస్తూ ఎవరైనా పట్టుపడితే జైల్లో పెట్టి చిత్రహింసలు పెడతారు. ఆ తరువాత ప్రజల్లోకి తీసుకొచ్చి బెత్తంతో కొడతారు. జనమంతా చూస్తుండగా దండించే ఈ చట్టాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మాత్రం అమలు చేస్తూనే ఉంది. ఇది అనాగరికమని, హక్కుల సంఘాలు, అంతర్జాతీయ సమాజం మండిపడతున్నారు. ఇద్దరు మగవాళ్లు  కౌగిలించుకుంటే శిక్షలు వేయడం లేదని, పైగా ప్రోత్సహిస్తున్నారని, ప్రేమతో హగ్ చేసుకుంటే మాత్రం శిక్షించడం సరికాదని అంటున్నారు. Telugu News Teenagers are thrashed for having a cuddle: Woman, 18, and her boyfriend are whipped with a bamboo cane in public for breaching Indonesia’s strict Sharia law