తేజ సినిమా.. దగ్గుబాటి సురేశ్ వేసిన బిస్కెట్.. శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

తేజ సినిమా.. దగ్గుబాటి సురేశ్ వేసిన బిస్కెట్.. శ్రీరెడ్డి

April 11, 2018

శ్రీరెడ్డి లీక్స్ పెను సంచలనాలకు దారి తీస్తున్నాయి. హీరో రానా తమ్ముడు, నిర్మాత దగ్గుబాటి సురేశ్ తనయుడు అభిరామ్ తనను వాడుకొని వదిలేసాడని శ్రీరెడ్డి అతనితో సన్నిహితంగా వున్న ఫోటోలను లీక్ చేసింది. కానీ ఇంత వరకు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఎవరూ స్పందించలేదు. ఇదిలావుండగా ఈ వివాదం నడుస్తుండగా దర్శకుడుశ్రీరెడ్డికి తేజ తనకు రెండు సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నట్టు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. తేజా కూడా లైవ్ పెట్టి శ్రీరెడ్డికి మద్దతుగా మాట్లాడారు. అందరూ మన తెలుగమ్మాయికి అవకాశాలు ఇవ్వాలని చెప్పారు. కానీ శ్రీరెడ్డి తేజా సినిమా అవకాశాన్ని అదొక బిస్కెట్ అని తేల్చి చెప్పింది.దీని వెనకాల పెద్ద తలకాయలు వున్నాయని శ్రీరెడ్డి పేర్కొంది. ఒక ప్రైవేట్ మీడియా ఛానల్లో శ్రీరెడ్డి ఈ విషయాన్ని చెప్పింది. తేజా ప్రస్తుతం రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. అందులో ఒకటి వెంకటేష్‌తో, ఇంకొకటి బాలకృష్ణతో చేస్తున్నారు. ‘ఆ అమ్మాయి తెలుగమ్మాయిలకు అవకాశాలు లేవంటోంది కాబట్టి రెండు అవకాశాలు ఇచ్చి తన నోరు మూయించండని చాలా ప్లాన్‌గా చేయించారు. ఈ ఇష్యూలో సురేష్ బాబు అనే పెద్ద తలకాయ వుంది. దాన్ని ఎదురించే దమ్ము ‘మా’ లేదు. అందుకని నా నోరు మూయించటానికి తేజతో, ప్రతాని రామకృష్ణ గౌడ్‌తో బిస్కెట్లు వేయించారు’ అంటూ శ్రీరెడ్డి తెలిపింది.

ఇలాంటివి ఎన్ని బిస్కెట్లు, బెదిరింపులకు పాల్పడినా నేను వెనక్కు తగ్గను. సురేష్ బాబు ప్లేసులో ఒక సామాన్యుడు వుంటే వదిలిపెట్టేవారు కాదు కదా అని ప్రశ్నించింది శ్రీరెడ్డి. నాకు న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆపను. అభిరామ్‌కు సంబంధించిన ఇంకా ఆధారాలు తన వద్ద వున్నాయని చెప్పింది. వాట్సాప్ చాట్‌లు, వందల మెసేజ్‌లు, ఫోటోలు వున్నాయని తెలిపింది. తాను ఇన్ని ఆధారాలు బయట పెట్టినప్పటికీ ప్రభుత్వాలు స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డికి మద్దతుగా మహిళా సంఘాలు కలిసి రావటం గమనార్హం. నటి అపూర్వ కూడా శ్రీరెడ్డికి మద్దతుగా నిలబడింది. ఆమె రావటంతో ఇంకా చాలా మంది కాస్టింగ్ కౌచ్‌కు బలైన అమ్మాయిలు ముందుకు వస్తున్నట్టు అపూర్వ తెలిపారు.