శ్రీరెడ్డి గెలిచింది.. రెండు ఆఫర్లు ఇచ్చిన తేజ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డి గెలిచింది.. రెండు ఆఫర్లు ఇచ్చిన తేజ

March 28, 2018

సినిమాలు తీసి తర్వాత నీతులు చెప్పుకుందాం. అయితే ముందు మన తెలుగు ఆడబిడ్డకు అవకాశాలు ఇద్దాం ’ అన్నారు దర్శకుడు తేజ. వర్ధమాన నటి శ్రీరెడ్డికి తన రాబోయే రెండు సినిమాల్లో మంచి పాత్రలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈమధ్య అన్నీ టీవీ నళ్ళలో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ మీద గళం విప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయమై తేజ స్పందిస్తూ.. ‘ శ్రీరెడ్డి ఎటువంటిది ఎలాంటిది అని చూడకుండా ఆమెకు వేషాలు ఇచ్చి ఆదుకుందాం. తెలుగు సినీ రంగానికి చెందిన ఒక ఆడపిల్ల ఇన్ని కష్టాలు పడటం చూస్తుంటే బాధేస్తోంది. అందుకే తనకు నేను రెండు అవకాశాలు ఇస్తున్నాను. అలాగే తనకు ప్రామిస్ చేసినవారందరు కూడా వేషాలు ఇవ్వండి. ఆమెకు జరిగిన అన్యాయానికి సినిమా ఇండస్ట్రీ న్యాయం చెయ్యాలి. ముందు మన ఇండస్ట్రీని, మనవాళ్ళను బాగా చూస్కుందాం ’ అన్నారు తేజ.

తేజ ఇచ్చిన ఆఫర్‌కు స్పందించిన శ్రీరెడ్డి ‘ ఇన్ని రోజులుగా నేను ఇంతగా పోరాడుతుంటే.. ఎవరూ నన్ను పట్టించుకునే పాపానికి పోలేదు. తేజ గారు సహృదయంతో స్పందించి నాకు సినిమా అవకాశం ఇవ్వటం చాలా సంతోషంగా వుంది ’ అని హర్షం వ్యక్తం చేశారు.