‘ఈ నగరానికి ఏమైంది’ అంటున్న తేజ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఈ నగరానికి ఏమైంది’ అంటున్న తేజ

October 27, 2017

నేనే రాజు నేనే మంత్రి ’ సినిమాతో మళ్ళీ పుంజుకున్న దర్శకుడు తేజా మరో రెండు కొత్త సినిమాలతో బిజీ అయ్యాడు. వాటిలో ఒకటి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ కాగా రెండవది వెంకటేష్‌తో చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘ ఈ నగరానికి ఏమైంది ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు.

ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినా, కొంత విరామం తర్వాత ఆ సినిమాను మొదలు పెట్టే అవకాశం వుందంటున్నారు. ఎందుకంటే బాలకృష్ణ వేరే ప్రాజెక్టులో బిజీగా వుండటమే ఇందుకు కారణం. ఇక అబ్బాయికి హిట్టివ్వడంతో బాబాయ్ చూపు తేజా మీద పడింది. వెంటనే తేజా కథ వినిపించడం, వెంకీకి నచ్చడం వెంటవెంటనే జరిగిపోయాయి. నవంబర్ 16న లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ సినిమాలో నారా రోహిత్ విలన్‌గా నటించే అవకాశాలున్నట్టు సమాచారం.