mictv telugu

మేడ్చల్ కలెక్టర్‌కు కేటీఆర్ ట్వీటారు..

January 9, 2019

టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కొన్ని విషయాల్లో తానే స్వయంగా చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తుంటారు. తాజాగా ఆయన ట్విటర్లో ఓ నెటిజన్ తన దృష్టికి తీసుకొచ్చిన అంశంపై వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  మేడ్చల్ జిల్లాలోని కీసర్ చెరువును ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడంటూ వెంకట్ బోగి అనే వ్యక్తి కేటీఆర్‌కు ఈ రోజు ట్విటర్ ద్వారా తెలిపారు. చెరువులో మట్టి తోలిన ఫొటోను కూడా జత చేశారు. దీనిపై దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. ఈ వ్యవహారమేంటో చూడాలంటూ వెంటక్ ట్వీట్‌ను జిల్లా కలెక్టర్, హెచ్ఎండీఏ అధికారులకు ట్యాగ్ చేశారు. ఈ అంశంపై పలువురు వెంకట్‌ను, కేటీఆర్‌ను ప్రశంసిస్తున్నారు. ‘చెరువుకు కలిగిన నష్టం మీద ఒక పౌరునిగా స్పందించడం, KTR కూడా స్పందించడం మంచి పరిణామం…’ అని కొనియాడారు.Telugu news telanana TRS working president KTR response on Keesara tank encroachment  and tagged with Medchal collector and HMDA