తెలంగాణకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబేనట..హవ్వ! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబేనట..హవ్వ!

February 24, 2018

అదేంటి తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ కదా..చంద్రబాబు అని అన్నది ఎవరు? పెగ్గేశి మాట్లాడిండా ఏంది అని అనుకుంటున్నారు కదా…ఏమో మరి, రాశినోళ్లు ఏ మూడ్‌లో ఉండి రాశిన్రో. విశాఖలో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ఈరోజు మొదలైంది.

అయితే ఈ సదస్సులో ఎవరెవరు పాల్గొంటారు. కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటి, ఎప్పుడు మొదలవుతుంది, ఎన్నిగంటలకు ముగుస్తుంది. ఇలా అన్ని వివరాలు ఉన్న షెడ్యూల్ పేపర్లో  తెలంగాణకు మరియు ఆంధ్రప్రదేశ్  కలిపి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేసారు నిర్వాహకులు. ఇంత పెద్ద కార్యక్రమానికి షెడ్యూల్ తయారు చేసేవాళ్లకు చంద్రబాబు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రో తెల్వదేమో పాపం. లేక రాసేటప్పుడు పొరపాటున పడిందో గాని మొత్తం మీద చంద్రబాబును రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ముఖ్యమంత్రిని చేసేశారు.

మరి స్టేజిమీద అనౌన్సర్ ఎవరో గాని పేపర్లో ఉన్నది ఉన్నట్లు చదివాడో లేక కఫ్యూజ్ అయ్యాడో మరి. వివిధ దేశాల పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్న ఇంత పెద్ద సదస్సులో  ఇలాంటి బ్లండర్ మిస్టేక్ లుంటే  వచ్చినవారు ఏమనుకుంటారు? అని అనుకుంటున్నారు అమరావతిని చంద్రబాబు మరో సింగపూర్ చేస్తాడు అని కలలుగంటున్న ఆయన అభిమానులు.