తెలంగాణ, ఏపీకి దక్కిన రైల్వే నిధులు ఇవీ.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ, ఏపీకి దక్కిన రైల్వే నిధులు ఇవీ..

February 1, 2018

మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోని రైల్వే కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. నామమాత్రపు ప్రాజెక్టుల కేటాయింపులతో  వీటిని నిరాశే మిగిలింది. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పలు ప్రాజెక్టులకు ఏ మూలకూ చాలని నిధులు కేటాయించించారు. విశాఖ జోన్  ఏర్పాటు ప్రతిపాదనకు  గండికొట్టారు.

రెండు రాష్ట్రాలకు కేటాయింపులు, కొత్త రైల్వే లైన్లు :  

 • హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రెండోఫేజ్‌కై రూ. 100 కోట్లు
 • కాజీపేట – బళ్ళారి మూడోలైన్‌ కొరకు రూ. 160 కోట్లు
 • కోటిపల్లి – నర్సాపూర్‌ కొత్త రైల్వేలైన్‌ ప్రాజెక్టుకు రూ. 430 కోట్లు కేటాయింపు
 • కాకినాడ – పిఠాపురం కొత్త రైల్వేలైన్‌‌కు రూ. 150 కోట్లు
 • విజయవాడ – గూడురు మూడోలైన్‌ కోసం రూ. 100 కోట్లు
 • విజయనగరం – స్తంభాలపూర్‌ మూడో రైల్వేలైన్‌ కోసం  రూ. 90 కోట్లు
 • సికింద్రాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనుల కోసం రూ. 50 కోట్లు
 • నడికుడి – కాళహస్తి కొత్త రైల్వేలైన్‌‌కై రూ. 340 కోట్లు
 • అక్కన్నపేట – మెదక్‌ మధ్య 17 కిలోమీటర్ల రైల్వేలైన్‌ కోసం రూ. 196 కోట్లు
 • గుంతకల్‌ – బళ్లారి హోస్పేట్‌ విద్యుదీకరణకు రూ. 70 కోట్లు
 • మనోహరాబాద్‌ ( మేడ్చల్‌ ) – కొత్తపల్లి ( కరీంనగర్‌ ) లైన్‌‌కై రూ. 350 కోట్లు
 • కాజీపేట – విజయవాడ మూడో రైల్వేలైన్‌‌కు రూ. 100 కోట్లు
 • భద్రాచలం నుంచి సత్తుపల్లి కొత్త రైల్వేలైన్‌ కోసం  రూ. 300 కోట్లు
 • విజయనగరం – రాయగడ – రాయపూర్‌ విద్యుదీకరణకై రూ. 120 కోట్లు
 • నల్లపాడు  -గుంతకల్‌ లైను విద్యుదీకరణకు రూ. 150 కోట్లు
 • మునీరాబాద్‌ – మహబూబ్‌నగర్‌ కొత్త రైల్వేలైన్‌  కోసం రూ. 300 కోట్లు
 • విజయవాడ – గుడివాడ, మచిలీపట్నం – భీమవరం, నర్సాపూర్‌ – నిడదవోలు రైల్వేలైన్ల డబ్లింగ్‌ పనుల కొరకు రూ. 122 కోట్లు కేటాయింపు
 • చర్లపల్లి స్టేషన్‌లో శాటిలైట్‌ టర్మినల్‌ కోసం రూ. 5 కోట్లు
 • కడప – బెంగళూరు రైల్వేలైన్‌ ప్రాజెక్టు కోసం  రూ. 240 కోట్లు
 • ఓబులవారి పల్లె-కృష్ణపట్నం కొత్త రైల్వేలైన్‌కు రూ. 100 కోట్లు

 

తెలంగాణకు రానున్న  ఏ-1 స్టేషన్లు ఇవి :

 • వరంగల్‌, కాజీపేట,  ఖమ్మం, మంచిర్యాల

ఆదర్శ స్టేషన్లు ఇవి :

 • శంకర్‌పల్లి, గద్వాల, రఘునాథపల్లి, బాసర, కేసముద్రం

కొత్తగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించనున్న స్టేషన్లు ఇవే :

 • ఆదిలాబాద్‌, వనపర్తి, నిజామాబాద్‌, డోర్నకల్‌, లింగంపల్లి, కాజీపేట

ఏపీలోని ఆదర్శ రైల్వే స్టేషన్లు ఇవే :

ఒంగోలు, పార్వతీపురం, వినుకొండ, విజయవాడ,  గుంటూరు, బొబ్బిలి, మంత్రాలయం రోడ్‌, మర్కాపూర్‌ రోడ్‌, మచిలీపట్నం, విశాఖ రైల్వేస్టేషన్ల , రాజమండ్రి, దొనకొండ, ఆదోని, విశాఖ, దువ్వాడ, కడప, తిరుపతిలలో అభివృద్ధి చేయనున్నారు.

అలాగే  తుని, రాజమండ్రి, రేణిగుంట,  బేతంచర్ల, ధర్మవరంలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నారు.  పలాస, లక్కవరపు కోట, రాయనపాడు, గుంతకల్‌, పానపాకం,  మర్కాపూర్‌, పాకాల, నక్కనదొడ్డి, ఇచ్ఛాపురం, సాలూరు,సిమిలిగూడ,  కొత్తవలస, ఎస్‌ కోట, శివలింగాపురం, బొద్దవర, పుల్లంపేట, బొర్రా గుహలు, అరకు  రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాంలను విస్తరించనున్నారు.