mictv telugu

గురువారం కొలువుదీరనున్న తెలంగాణ అసెంబ్లీ

January 15, 2019

తెలంగాణాలో ఎన్నికలు ముగిసి ఇన్ని రోజులు కావస్తున్నా ఇంకా అసెంబ్లీ కొలువుదీరలేదనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాతి పండుగ ముగిసిన తరువాత అసెంబ్లీ కొలువుదీరుతుందని ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయి. రేపు ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం అభ్యర్థి ముంతాజ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్లుండి నుంచి ఉదయం 11.30కు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన సమావేశాలు ప్రారంభమవుతాయి. 18న స్పీకర్ ఎన్నిక, 19న అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, ఆమోదం ఉండనుంది. గురువారం రోజున ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతుండటంతో భద్రతపై సమీక్ష నిర్వహించారు పోలీసు ఉన్నతాధికారులు.

Telugu News telangana assembly session to start from thursday .

అసెంబ్లీ స్పీకర్ చాంబర్‌లో మండలి చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోని అన్ని ప్రాంతాలలో తిరిగి పరిశీలించారు సీపీ అంజనీ కుమార్. సమావేశాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. గురువారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Telugu News telangana assembly session to start from thursday