కేసీఆర్ దద్దమ్మ.. బండారు దత్తాత్రేయ.... - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ దద్దమ్మ.. బండారు దత్తాత్రేయ….

March 2, 2018

ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద దద్దమ్మ అని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ  తీవ్రంగా మండిపడ్డారు. లక్షన్నర కోట్ల  బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ. 10కోట్లు కూడా కేటాయించలేదని  కేద్ర ప్రభుత్వాని ప్రశ్నిస్తారా? అంటూ విరుచుకు పడ్డారు. దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీతో పోలుస్తారా ? అంటూ మండిపడ్డారు. రాష్ట్రం నుంచి మంత్రులు ఎవరైనా సరే ఢిల్లీ వెళ్తే కేంద్ర మంత్రులు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారని చెప్పారు.కేసీఆర్ కపట రాజకీయాలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని  దత్తాత్రేయ అన్నారు. వ్యవసాయం పేరిట కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే విధంగా కేసీఆర్ రాజకీయాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రైతులు వాస్తవాలను గ్రహిస్తున్నారని చెప్పారు. పస లేని వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడొద్దని సూచించారు.