ప్రకాశ్‌రాజ్‌తో బెంగుళూరు వెళ్లిన సీఎం కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రకాశ్‌రాజ్‌తో బెంగుళూరు వెళ్లిన సీఎం కేసీఆర్

April 13, 2018

టీఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ రోజు ఉదయం బెంగళూరు చేరుకున్నారు. ఉదయం 9:45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బెంగళూరు వెళ్లారు. సీఎం వెంట సినీ నటుడు ప్రకాశ్ రాజ్, ఎంపీ విపోద్,సంతోష్ కుమార్,సుభాష్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డిలు కూడా వెళ్లారు. సీఎం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు  మాజీ ప్రధాని దేవెగౌడతో బేటీ కానున్నారు.ఈ సమావేశం దేవెగౌడ నివాసం అమోఘలో జరగనుంది. ప్రస్తుత రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై దేవెగౌడతో చర్చించిన తర్వాత ఈ రోజు సాయంత్రం సీఎం హైదరాబాద్‌ చేరుకుంటారు.ఇటీవలే కోల్‌కతాలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో కేసీఆర్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్‌ సోరేన్‌ హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌‌తో సమావేశమయ్యారు. ఇపుడు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌, దేవెగౌడల భేటీ  మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.