మహాకూటమి లొల్లికి ముగింపు.. కాంగ్రెస్‌కు 93

నెల రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని ఇంకా సీట్ల పంపకం లొల్లిని కొనసాగించడం సరికాదని మహాకూటమి భావించింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పార్టీ నేతలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుని పంచాయతీ తెంచేసింది. పార్టీ ఎన్నికల కేంద్ర కమిటీ ఎవరికెన్ని సీట్లో తేల్చేసి జాబితా ప్రకటించండి అని ఆదేశించింది. మిత్రుల కోసం తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్ మరో రెండు సీట్లను త్యాగం చేసేసింది.

yy

పార్టీ నాయకురాలు సోనియాగాంధీ ఇంట్లో స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల తుది జాబితాపై మంతనాలు జరిపి తుది నిర్ణయం తీసుకుంది. తర్వాత సీనియర్ నేత కుంతియా మీడియాకు వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్  93 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. ‘తొలి విడతలో 74 మంది అభ్యర్థులను ఖరారు చేశాం. మిగతా పేర్లు కూడా ఖరారవుతున్నాయి.  భాగస్వామ్య పార్టీలకు 26 సీట్లు కేటాయించాం. 14 స్థానాలు టీడీపీకి, 8 టీజేఎస్‌కు, 3 స్థానాలు సీపీఐకి, ఒక స్థానాన్ని తెలంగాణ ఇంటి ఇచ్చాం.. ఈ నెల 10వ తేదీన శనివారం ఉదయం జాబితాను ప్రకటిస్తాం. 11, 12 తేదీల్లో మళ్లీ సమావేశమై మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేస్తాం.. ’ అని తెలిపారు.

Telugu news Telangana Congress finalizes Mahakutami seat sharing after consulting high command fixes TDP 14 and TJS, CPI