వీహెచ్‌కు తప్పిన పెను ముప్పు.. హత్యకు కుట్ర అని..   - MicTv.in - Telugu News
mictv telugu

 వీహెచ్‌కు తప్పిన పెను ముప్పు.. హత్యకు కుట్ర అని..  

November 21, 2018

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన తిరుగుతున్న ఎన్నికల ప్రచారం రథం ప్రమాదానికి గురైంది. అయితే వీహెచ్ సురక్షితంగా బయటపడ్డారు.

Telugu news Telangana Congress leader VH V.Hanumantha Rao escaped for accident claims murder plan

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామం వద్ద ఆయన బుధవారం ప్రచారం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి తరఫున ప్రచార రోడ్షోలో పాల్గొన్న పెద్దాయన తిరిగి హైదరాబాద్కు వెళ్తుండగా నేరెళ్ల గ్రామ శివారు వద్ద రథం రెండు చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపు చేశారు. దీంతో వీహెచ్, వాహనంలోని ఇతరులు ఎలాంటి గాయాలూ కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. కాగా,  బస్సు స్క్రూలను తొలగించడంతో చక్రాలు ఊడిపోయాయని, తన హత్యకు ఎవరో కుట్ర పన్నారని వీహెచ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించే వరకు అక్కడి నుంచి కదలనని అన్నారు.

Telugu news Telangana Congress leader VH V.Hanumantha Rao escaped for accident claims murder plan