mictv telugu

ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ!?

February 6, 2019

1980 లో ఇందిరా గాంధీ తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా తెలంగాణ నుంచి పోటీ చేయించడానికి ఇక్కడి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలంగా ఉందని.. ఖమ్మం లోక్‌సభ సభ్యునిగా మీరు పోటీ చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నందున మీరూ రెండు స్థానాల్లో పోటీ చేయాలని.. అందులో ఒకటి ఖమ్మం కావాలన్నారు. దీనికి రాహుల్ గాంధీ సరే చూద్దామని స్పందించినట్టు సమాచారం.

Telugu News Telangana Congress leaders asking AICC president Rahul Gandhi to contest from Khammam in Lok Sabha elections  ......

లోక్‌సభ ఎన్నికలు దేశహితం దృష్ట్యా జరిగేవి కనుక పోటీ భాజపా, కాంగ్రెస్‌ మధ్యనే ఉంటుందని.. టీఆర్‌ఎస్ కన్నా బీజేపీపైనే దృష్టి పెట్టాలని వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిలు బోస్‌ రాజు, శ్రీనివాస కృష్ణన్‌, సలీం అహ్మద్‌, మధు యాస్కీ గౌడ్‌, మండలి శాసనసభపక్ష నేత షబ్బీర్‌ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్‌కుమార్‌, ప్రచార కమిటీ ఛైర్మన్‌ విజయశాంతి, ఎమ్మెల్యేలు సీతక్క, సబితా ఇంద్రారెడ్డి, బాణోత్‌ హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పొదెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నల్లమడుగు సురేందర్‌, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, ఆత్రం సక్కు హాజరుకాలేదు.

Telugu News Telangana Congress leaders asking AICC president Rahul Gandhi to contest from Khammam in Lok Sabha elections