విద్యుత్ శాఖలో కొలువులు   - MicTv.in - Telugu News
mictv telugu

విద్యుత్ శాఖలో కొలువులు  

November 3, 2017

నిరుద్యోగులకు  తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్న 600 అసిస్టెంట్ ఇంజనీర్ ( ఏఈ)  పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ( టీఎస్‌ట్రాన్స్ కో) , దక్షిణ విద్యుత్ పంపిణి సంస్థ( ఎస్సీడీఎస్సీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (ఎన్పీడీసీఎల్)‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది.

ఈ ఖాళీలన్నిటికి ఒకేసారి ఉమ్మడిగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఎలక్ట్రికల్,సివిల్, మోకానికల్,ఐటీ విభాగాల్లో  ఏఈ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనుంది.  రెండేళ్ల కిందట జారీ చేసిన1427 ఏఈ పోస్టుల నియామక ప్రక్రియను జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం చర్య తీసుకుంది.