స్పెషల్ కేర్… దివ్యాంగులకై 3వేల మంది వాలంటీర్లు

తెలంగాణలో జరుగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు యుద్ధ ప్రాతిపదికన చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో దివ్యాంగులను పోలింగ్ కేంద్రాల వరకు చేర్చడంతో పాటు వారికి అవసరమైన సేవలు అందించేందుకు సుమారు మూడువేల మంది వలంటీర్లను నియమిస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి ఎం.దాన కిశోర్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ, దివ్యాంగుల సౌకర్యం కోసం అన్నీ పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులను నిర్మించినట్లు, పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌చైర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు.Telugu News telangana election commission arrangements for handicaps and eldersవికలాంగులు, వృద్ధులు, గర్భిణీలు తదితరులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు కావాల్సిన సహాయం అందించాలని దానకిశోర్ వాలంటీర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతీ వాలంటీర్ తప్పనిసరిగా ఎన్నికల విధులకు సంబంధించిన టీ-షర్ట్ ధరించాలని ఆదేశించారు. దివ్యాంగులు, వృద్దులు తదితరులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేటప్పుడు టేబుల్-1, పీఓ, ఏపీఓల వద్దకు తీసుకొని వెళ్లాలని సూచించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో దివ్యాంగుల ఓటర్ల సంఖ్య, ప్రతి గంటకూ పోలైన వారి ఓటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని దానకిశోర్ సూచించారు.