ఎగ్జిట్ పోల్స్‌‌లోనూ మేమే గెలవాలి.. ఓపిక లేదు గురో..

తెలంగాణ అసెంబ్లీ ఓటింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయంలో కూడా పార్టీల నాయకులు వెనక్కు తగ్గడం లేదు. తమకంటే తమకే అనకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఓటింగ్ ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియా మీట్ పెట్టారు. తమకు అనకూలంగా ఉన్న ఫలితాలను కోట్ చేస్తూ అలా అలా ప్రెస్ తో మాట్లాడారు.

rr

పోలింగ్ కు ముందు పోటాపోటీగా విమర్శలు చేసుకున్న నాయకులు ఫలితాలు రావడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఎవరి బలమెతో తెలిసి పోతుంది. ఎవరెన్ని స్థానాలు సాధిస్తారు. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారో కూడా తెలుస్తుంది. అయినా నాయకులకు ఓపిక లేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా తమకే విజయం కట్టబెట్టాలన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ పోల్స్ ఫలితాలపై పోటాపోటీ ప్రెస్ మీట్లు పెట్టి విలేకర్ల చెవులను కొరుక్కు తింటున్నారు.

t

తామంటే తామే అధికారంలోకి రాబోతున్నామనే విశ్లేషణలు చేస్తున్నారు. అన్ని రకాల సర్వేలు మాత్రం కారు పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్తున్నాయి. లగడపాటి సర్వే మాత్రం అన్నింటికీ భిన్నంగా ఉంది. ఇప్పుడు చర్చ అంతా దీనిపైనే జరుగుతున్నది. ఆయన చెప్తున్న సర్వే ఫేక్ అనే వాళ్లూ ఉన్నారు. ఏదో చూస్తే తెలుస్తుంది కదా అంటూ సర్వే ఫలితాలపైనే మాట్లాడుకుంటున్నారు.

అస్సలు ఎన్నికల ఫలితాల టెంపోను ఎగ్జిట్ పోల్స్ ఆక్రమించాయనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే ప్రజలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లేననే కొందరు అంటున్నారు. దీనిపై నాయకులు మాట్లాడుతున్నా కొద్ది ప్రజల్లో మరింత ఆసక్తి పెరుగుతున్నది. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కొన్నింటితో సరిపోలుతున్నాయి. హంగ్ రావడానికి, కూటమి అధికారంలోకి రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే వారే ఎక్కువగా ఉన్నారు.

rr
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంటే ఎన్నికలకు ముందే పరిస్థితి అర్థం అయ్యదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరింతలా ఎగ్జిట్ ఫలితాల్లో వేరియేషన్ ఎందుకు ఉందనే చర్చ కూడా ఉంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టిఆర్ఎస్ కు అనకూలంగా వచ్చాయి. న్యూస్ ఎక్స్, రిపబ్లిక్ పోల్స్ మాత్రం కారు పార్టీకి అధికారం చేపట్టేంత మెజార్టీని చూపించాయి. లగడపాటి రాజగోపాల్ సర్వేలు ప్లస్ ఆర్ మైనస్ లు తీసి వేసిన తర్వాత కూడా నలభై ఐదుకు పైగానే ఉన్నాయి.

rr
ఏ సర్వే అయినా ఎట్లా లెక్కులు వేసుకున్నా పార్టీల నాయకులు మీడియాతో ఎలా చెప్పుకున్నా అవకాశాలు మాత్రం కారు పార్టీకే ఉన్నాయనే విషయంలో మెజార్టీ ప్రజలు అంగీకరిస్తున్నారు. కాకా పోతే ఒకటి రెండు సీట్లు తక్కువ అయితే మిత్రులతోసర్దుబాటు ఉంటుందనే చర్చకూడా జరుగుతున్నది. ఎన్నికలకు ముందు ఎన్నికల రోజున పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినా అది హంగ్ వచ్చేలాంటి పరిస్థితులను సృష్టించే అవకాశం లేదని మరి కొందరు అంటున్నారు. ఇంకొద్ది గంటలు ఆగితే ఎవరు అధికారంలోకి వచ్చేది, తెలంగాణ ప్రజల ఆలోచన ఏమిటీ. ఎవరిని ఎందుకు కాదనుకున్నారు. ఎవరైతే ఎందుకు బావుంటుందనుకున్నారనే విషయాలపై స్పష్టత వస్తుందని రాజకీయ పండితులు అంటున్నారు.