మైక్ టీవీ తెలంగాణ డే పాటకు బ్రహ్మరథం - MicTv.in - Telugu News
mictv telugu

మైక్ టీవీ తెలంగాణ డే పాటకు బ్రహ్మరథం

May 30, 2018

జూన్ 2న రానున్న తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘మైక్ టీవీ’ మరో పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోయినసారి చేసిన పాటకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు ఈ పాటను కూడా ఆదరిస్తున్నారు. ‘ఓరుగల్లు కోటనడుగు.. కోటలోని కత్తినడుగు.. చెబుతాయిలే ఈనేల ఘనతనే ’ అంటూ అధ్బుతమైన సాహిత్యాన్ని అందించిన డా. కందికొండ అక్షరాలను అంతే అందంగా ఆలపించారు మంగ్లీ, జంగిరెడ్డిలు.

‘పాటలోని ప్రతీ అక్షరం తెలంగాణ ఆత్మను పట్టించింది.. ఆంధ్రావాళ్ళమైనా మాకు కూడా తెలంగాణ పాటలు చాలా ఇష్టం.. అందులోనూ మైక్ టీవీ పాటలు చాలా ఇష్టం..’ అని వీక్షకులు అభినందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత జంగిరెడ్డి గాత్రం విన్నామని కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీ ఆదరణతో ముందు ముందు కూడా ఇలాంటి మరిన్ని మంచి పాటలతో మీ ఆదరాభిమానాలను చూరగొంటామని వాగ్దానం చేస్తున్నాం.

సాహిత్యం : డా. కందికొండ

సంగీతం : నందన్ బొబ్బిలి

సింగర్స్ : మంగ్లీ, జంగిరెడ్డి

ఎడిటర్ : ఉదయ్ కుంభం

కెమెరా : తిరుపతి, కొత్వాల్ మధు

మేకింగ్ బై : దామురెడ్డి కొసనం

నిర్మాత : అప్పిరెడ్డి

కీబోర్డ్ అండ్ రిథమ్స్ : బాలాజీ లైవ్ రిథమ్స్