చెవికి చేయూత.. వినికిడి పరికరాలు ఉచితం

కంటి వెలుగు పేరుతో ఉచిత ఆపరేషన్లు చేయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో ప్రజోపయోగ నిర్ణయం తీసుకుంది. వినికిడి లోపంతో బాధపడుతున్న వారిని ఆదుకోనుంది. చెవి, ముక్కు, గొంతు, దంత వైద్య పరీక్షల శిబిరాల్లో వినికిడి ఉపకరణాలను ఉచితంగా అందజేయనుంది.Telugu news Telangana government distributes free hearing aids to poor on the lines of spectacles for eye surgeries ఒక్కో వినికిడి పరికరం ధర రూ. 2,500-3,000 వరకూ ఉంటుందని. రూ. 36 కోట్లు అవసరమని  అంచనా. కంటి వెలుగు వైద్య శిబిరాల్లో కళ్లద్దాలను ఉచితంగా అందజేసినట్లే ఈఎన్టీ శిబిరాల్లోనూ వినికిడి పరికరాలను ఉచితంగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు  లక్షన్నరమందికి పైగా ఇవి అవసరమవుతాయని భావిస్తున్నారు. చెవి పరీక్షలకు శ్రవణం అనీ, దంత పరీక్షలకు దంత క్రాంతి అని పథకాలకు పేర్లను ఆరోగ్యశాఖ ప్రతిపాదింది. రాష్ట్రంలో 1.20 లక్షల మంది తీవ్రమైన వినికిడి సమస్యలతో బాధ పడుతున్నారని అంచనా.