mictv telugu

మధులికకు తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షల సాయం

February 13, 2019

ప్రేమోన్మాది దాడిలో గాయపడి ఆస్పత్రిలో చావుతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మధులికకు తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షలు ఆర్థిక సాయం అందజేసింది. వారం రోజుల క్రితం హైదరాబాద్ బర్కత్‌పురాలో ఇంటర్మీడియట్ చదువుతున్న మధులిక‌పై భరత్ అనే యువకుడు కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన మధులిక మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.Telugu News Telangana Government Financial Help To Rs. 5 Lakhs To The Victim Madhulikaభరత్ అనే యువకుడు కొద్ది రోజులుగా మధులికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీనికి ఆమె అంగికరించకపోవడంతో దీంతో ఆగ్రహానికి గురైన భరత్.. అమెపై కత్తితో దాడిచేయడంతో ఆమెకు మెడ, కడుపు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక కొద్ది కొద్దిగా కోలుకుంటోంది. బాధితురాలుకి ఆర్థిక సాయం అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు రూ.5లక్షల చెక్కును అంబర్‌పేట ఎమ్మెల్యే వెంకటేశ్ బుధవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులికకు అందజేశారు.