నిరుద్యోగులకు శుభవార్త...జాబ్స్ అనుకునెరు..కాదు ! - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు శుభవార్త…జాబ్స్ అనుకునెరు..కాదు !

February 23, 2018

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఏమీటి  కొత్తగా మళ్లీ ఏమైనా జాబ్స్ పడబోతున్నాయా? నోటిఫికేషన్ ఎప్పుడు అని అడగబోతున్నారా? మేం శుభవార్త అన్నది జాబ్స్ గురించి  కాదు, ప్రభుత్వం మీకివ్వబోయే భృతి గురించి. అవును  ఈ ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం  వృద్దుల పెన్షన్ తరహాలో నిరుద్యోగులకు  నెలనెలా రూ. 2 వేల  భృతి  ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఉద్యమ సమయంలో అండగా ఉన్న నిరుద్యోగులకు  ఉద్యోగ నోటిఫికేషన్లు అరకొరగా వస్తున్నాయి. దీనిపై  ప్రతిపక్షాలు  ఎప్పటికప్పుడు దుమ్మెత్తి   పోస్తున్నాయి. మరోవైపు  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  నిరుద్యోగ భృతిని  ఇస్తామని ప్రకటించింది. వీరందరికి  చెక్ పెట్టేందుకే  కేసీఆర్ ప్రభుత్వం  ఈ కొత్త నిర్ణయం తీసుకుంది.  భృతి విధివిధానాలపై  కసరత్తు కూడా ప్రారంభమైంది. ప్రతి నెల నిరుద్యోగుల ఖాతాలో  నేరుగా పైసలు జమచేసేలా  సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. నిరుద్యోగులు ఎందరు ఉన్నారన్నా లెక్క తేలడం కోసం  సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను పరిశీలిస్తున్నారు.