వైద్య ఆరోగ్య శాఖలో 4 వేల కొలువులు - MicTv.in - Telugu News
mictv telugu

వైద్య ఆరోగ్య శాఖలో 4 వేల కొలువులు

December 11, 2017

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో  ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సర్కారు  అనుమతి ఇచ్చింది. ఖాళీగా ఉన్న 3,943 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనుంది.

వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులకు కొత్త పోస్టులను మంజారు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1,191 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 685 డిప్యూటీ సివిల్ సర్జన్లు, 453 ఆర్ఎంవో, 562 స్టాఫ్ నర్సు ఉద్యోగాలతో పాటు ఇతర పోస్టులను సర్కారు మంజూరు చేసింది.