తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

November 21, 2017

నిరుద్యోలకు  తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో  ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1,113 పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 46 ప్రిన్సిపాల్, 781 జూనియర్ లెక్చరర్లు, 77 సీనియర్ అసిస్టెంట్లు, 76 జూనియర్ అసిస్టెంట్లు, 78 ఫిజికల్ డైరెక్టర్లు, 78 లైబ్రేరియన్  పోస్టులను  ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి టీఎస్ పీఎస్సీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.