మార్చిలో తెంగాణలో లక్ష పెళ్ళిళ్ళు - MicTv.in - Telugu News
mictv telugu

మార్చిలో తెంగాణలో లక్ష పెళ్ళిళ్ళు

February 26, 2018

మార్చి 4,6,11 తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు కావటంతో ఇల్లిల్లూ పెళ్లి సందళ్ళతో మారుమోగిపోనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు బాజా భజంత్రీలతో సందడిగా మారనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష పెళ్ళిళ్ళు వుంటాయని అంచనా. మార్చి 4వ తేదీ ముహూర్తం  మరీ మంచిదంటున్నారు. ఆ రోజు హస్త నక్షత్రం. తిథి తదియ. కావటంతో లగ్నం శుభకరం అంటున్నారు. మార్చి 6న పంచమి. స్వాతి నక్షత్రం. 11న పూర్వాషాడ నక్షత్రం. మార్చిలో మరికొన్ని మంచిరోజులూ ఉన్నాయని సమాచారం.

పెళ్ళళ్ళ కోసం అప్పుడే ఫంక్షన్ హాళ్ళన్నీ అడ్వాన్స్ బుక్ అయిపోయాయి. చాలా మంది ఫంక్షన్ హాళ్ళు దొరక్క తికమక పడుతున్న సందర్భం ఎదువుతోంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ఫంక్షన్‌ హాళ్లు ఎప్పుడో బుక్కయిపోయాయి.

మంచి ముహూర్తం మించితే దొరకదని చాలా మంది ఆ ముహూర్తాల్లోనే తమ పిల్లల వివాహాలు చెయ్యాలని ఉబలాటపడుతున్నారు. ఇప్పుడు  కాకుంటే మళ్లీ ఏప్రిల్‌లో శ్రీరామనవమి తర్వాత మంచి రోజులు అందుబాటులోకి వస్తాయి. మూఢం, శూన్యమాసం వంటి నమ్మకాలు గల వారు సహజంగానే సరైన రోజుల కోసం ఎదురు చూస్తుంటారు. గతేడాది నవంబరు 23,26 తర్వాత వస్తున్న బలమైన ముహూర్తాలు ఇవేనని పంతుళ్ళు చెప్పటంతో పెళ్ళిళ్ళ సీజన్ మొదలైనట్టే వుంది. కాగా మార్చి 4, 6, 11 తేదీల్లోని అత్యధిక ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటలకు ముందువే కావటం విశేషం.