తెలంగాణ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్ బదిలీ

ఇటీవల ఏర్పాటైన తెలంగాణ రాష్ర్ట హైకోర్టు తొట్టతొలి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ టీబీ రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టు సీజేగా బదిలీ కానున్నారు. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ డీకే గుప్తా డిసెంబర్ 31 రిటైర్ కావడంతో ఆయన స్థానంలో జస్టిస్ రాధాకృష్ణన్‌ను పంపుతున్నారు.Telugu news Telangana High court first chief justice tb radhakrishnan transferred to calucutta Kolkata high courtఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ రంగన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆమోదం ఇక లాంఛనం మాత్రమే. కేరళకు చెందిన జస్టిస్ రాధాకృష్ణన్ పదోన్నతిపై గతేడాది జులై 1 ఉమ్మడి హైకోర్టు సీజేగా వచ్చారు. ఆయన బదిలీ కానుండడంతో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ను నియమిస్తారని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నాలుగున్నరేళ్లకు హైకోర్టును విభజించి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, అమరావతిలో ఏపీ హైకోర్టును ఏర్పాటు చేయడం తెలిసిందే.Telugu news Telangana High court first chief justice tb radhakrishnan transferred to calucutta Kolkata high court