వికీపీడియాతో తెలంగాణ ఒప్పందం - MicTv.in - Telugu News
mictv telugu

వికీపీడియాతో తెలంగాణ ఒప్పందం

October 28, 2017

సమగ్ర సమాచార దర్శిని వికీపీడియాతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని సులభరీతిలో, సమగ్రంగా ప్రజలకు అందించేందుకు ఇది దోహదపడుతుంది.

రాష్ట్ర ఐటీశాఖ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీ(బెంగళూరు) సంస్థ ప్రతినిధి పవన్ సంతోష్, రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ప్రముఖ వికీమీడియా పరిశోధకుుడు ప్రణయ్‌రాజ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.  తెలంగాణకు సంబంధించిన సమాచారం పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని, ఒప్పందం వల్ల రాష్ట్ర నైసర్గిక, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక తదితర అంశాలపై సమగ్ర సమాచారం ఇంటర్నెట్ యూజర్లకు అందుతుందని జయేశ్ రంజన్ చెప్పారు.