mictv telugu

18న కేసీఆర్ కేబినెట్ విస్తరణ.. 8 మందికి చాన్స్

January 7, 2019

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 18న కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆయన అధికారులతో చెప్పారు. ఈ రోజు హోం మంత్రి మహమూద్ అలీతో కలసి ఆయన కేబినెట్ భేటీ నిర్వహించారు. దీనికి పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.

Telugu news Telangana  kcr cabinet expansion on 18th january with 8 ministers orders arrangement to protocol and GAD officials   

ఈ నెల 18న 9 మందితో కేబినెట్ విస్తరణ ఉంటుందని,  దీనికి కావలసిన ప్రొటోకాల్, బులెట్ ప్రూఫ్ వాహనాలు, సిబ్బంది ఇతర ఏర్పాట్లు పూర్తి చేయాలని జేేేఏడీ, ప్రొటోకాల్ విభాగాలను  ఆయన ఆదేశించినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ సీఎంగా, అలీ హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంక్రాంతి సెలవులు,  పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెలలో కాకుండా ఫిబ్రవరిలో కేబినెట్ విస్తరణ ఉంటుందని భావించారు. అయితే ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించడంతో ముహూర్తం ముందుకు జరిగింది. సమావేశాల ప్రారంభం కోసం ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను తాత్కాలిక స్పీకర్‌గా నియమించడం తెలిసిందే. కాగా, కేబినెట్లోకి ఎవరెవరిని తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ, నీటిపారుదల శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచుకుంటారని వార్తలు వస్తున్నాయి.

Telugu news Telangana  kcr cabinet expansion on 18th january with 8 ministers orders arrangement to protocol and GAD officials