కేటీఆర్ అప్పులు, ఆస్తులు ఎంతో తెలుసా ? - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ అప్పులు, ఆస్తులు ఎంతో తెలుసా ?

November 19, 2018

సిరిసిల్ల టీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తన ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలను ఆయన అఫిడవిట్‌లో దాఖలు చేశారు. తన పేరు మీద ఉన్న స్థిర-చరాస్తులు, భార్య శైలిమ పేరు మీదున్న ఆస్తి, అప్పులతో పాటు కుమార్తె కుమారుడు హిమాన్షు పేరు ఎంత ఆస్తులు ఉన్నాయో కూడా అఫిడవిట్‌లో పొందుపరిచారు.  

తన పేరుపై రూ. 4,93,80,419 ఆస్తులు, రూ. 33,28,380 అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. తన భార్య శైలిమ పేరు మీద రూ. 36,69,54,317  ఆస్తులుండగా.. రూ.27,39,87,500 అప్పులు ఉన్నాయని, కుమార్తె అలేఖ్య పేరుతో 19,59,692 బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని, కుమారుడు హిమాన్షు పేరు మీద ఎలాంటి స్థిర, చరాస్తులు లేవని పేర్కొన్నారు. తనకు ఇన్నోవా కారు ఉందని, తనపై 16 కేసులు ఉన్నాయని అఫిడవిట్‌లో వెల్లడించారు.

Telugu News Telangana Minister KT Rama Rao Has Movable Assets Worth Rs 3.63 Crore.. Says In Elections Nomination Affidavit