కేటీఆర్ భాషణం.. అనితరసాధ్యం : పరుచూరి - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ భాషణం.. అనితరసాధ్యం : పరుచూరి

November 30, 2017

తెలంగాణ మంత్రి కెటీఆర్  చక్కని వక్త అని అందరికే తెలిసిందే. బహిరంగ సభల్లో  ఆకర్షించి,మన్నలను పొందుతుంటారు. ప్రత్యుర్థులకు చురకలు అంటిచడంలో తనదైన ముద్ర వేశారు. టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాత అంతటి వాగ్ధాటి ఉన్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిన్న జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)లో కేటీఆర్ ఆంగ్లంలో  అర్థవంతంగా, అనరళంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు.దీనిపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆయన్ను అభినందిస్తున్నారు.  సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.

‘ఇన్నాళ్లు రాజకీయ యోధునిగా, యువ నాయకుడిగా తెలిసిన మీరు నిన్న జరిగిన ప్రపంచ పారిశ్రామిక సదస్సులో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు. అభినందనలండి ! మీ భాషణం అనితరసాధ్యం’ అని పరుచూరి ట్వీట్ చేశారు.

పరుచూరి ప్రశంసకు ముగ్థుడైన ‘థ్యాంక్స్ సర్’ అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.