కానిస్టేబుల్ ఉద్యోగాలకు పచ్చజెండా - MicTv.in - Telugu News
mictv telugu

కానిస్టేబుల్ ఉద్యోగాలకు పచ్చజెండా

October 30, 2017

తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో  3,897 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. వీటిలో సివిల్ కానిస్టేబుల్ 907, ఆర్మ్‌డ్ రిజర్వ్ 2,990 పోస్టులు ఉన్నాయి. ఈమేరకు  ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ద్వారా నియామకాలు చేపడతారు.  ప్రభుత్వం ఇచ్చి ఆదేశాలతో త్వరలోనే విధివిధానాలతో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ త్వరలో నో టిఫికేషన్ విడుదల చేయనున్నది. ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.