లెక్క తేలింది.. తెలంగాణ పోలింగ్ 73.2 శాతం - MicTv.in - Telugu News
mictv telugu

లెక్క తేలింది.. తెలంగాణ పోలింగ్ 73.2 శాతం

December 8, 2018

ఒక రోజు ఆలస్యంగానైనా లెక్క తేలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ వివరాలను  ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 73.2శాతం పోలింగ్‌ శాతం నమోదైన్లు ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ కాసేపటి కిందట వెల్లడించారు. గత ఎన్నికలకంటే 3.7 శాతం ఎక్కువగా నమోదైందన్నారు. 2014 ఎన్నికల్లో 69.5 శాతం నమోదైందని, తాజా పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నామని వెల్లడించారు.

ggg

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగియగా.. 69.1శాతానికిపైగా పోలింగ్‌ నమోదైనట్లు ఆయన చెప్పడం తెలిసిందే. అయితే పలు కేంద్రాల్లో రాత్రి 10.30గంటల తర్వాత కూడా పోలింగ్ సాగిందని, కొన్ని సాంకేతిక కారణాలతో వివరాలు అందలేదంటూ సవరించిన శాతాన్ని వెల్లడించారు. శనివారం పూర్తి వివరాలు అందాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు బాగా పడ్డాయని తెలిపారు.

జిల్లాల వారీగా చూస్తే నిర్మల్ 81.22, నిజామాబాద్ 76.22, కామారెడ్డి 83.05, జగిత్యాల 78.99, పెద్దపల్లి 80.58, వికారాబాద్ 76.87, మేడ్చల్, మల్కాజ్ గిరి 55.85, హైదరాబాద్ 48.89, మహబూబ్ నగర్ 79.42, నాగర్ కర్నూల్ 82.04, వనపర్తి 81.65, జోగులాంబ గద్వాల 82.87, నల్గొండ 86.82, సూర్యాపేట 86.63, యాదాద్రి భువనగిరి 90.95, జనగాం 87.39, మహబూబాబాద్ 89.68, వరంగల్ రూరల్ 89.68, వరంగల్ అర్బన్ 71.18, జయశంకర్ భూపాలపల్లి 82.31, భద్రాద్రి కొత్తగూడెం 82.46, ఖమ్మం 85.99, మంచిర్యాల 78.72, ఆదిలాబాద్ 83.37 శాతం పోలింగ్ జరిగినట్లు ఆయన తెలిపారు.

నియోజక వర్గాల వారీగా పోలింగ్ శాతం కోసం ఈ లింకును క్లిక్ చేయండి

Voter Turnout- Press Release