తెలంగాణ రైతుబంధు పథకం అందమైన ముగ్గులో..

సంక్రాంతి పండగంటేనే రైతుల పండగ. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పంట పండిస్తారు రైతులు. ఇంటికొచ్చిన పంటసిరిని చూసి రైతుల కంట, ఇంట ఆనందాల కాంతులు ప్రసరిస్తాయి. ఈక్రమంలోనే సంక్రాంతి పండగ చేసుకుంటాం. మళ్లీ వచ్చే సంక్రాంతి వరకు రైతన్న జీవితాల్లో వెలుగు చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రైతుల జీవితాల్లో నిత్య సంక్రాంతులు చూడాలని రైతుబంధు పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. పంట పెట్టుబడి సాయం అందించిన సీఎం కేసీఆర్‌ను తెలంగాణ రైతులంతా ఈ సంక్రాంతి పర్వదినాన గుర్తు చేసుకుంటున్నారు.

Telugu news Telangana Raithuibandhu scheme in Sankranthi muggu .

ఓ మహిళ రైతుబంధు పథకం కనిపించేలా వినూత్నంగా ముగ్గు వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన నీతూరెడ్డి అనే మహిళ అందరి దృష్టిని ఆకర్షించేలా రైతుబంధు ముగ్గు వేసి కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గుండ్రంగా వున్న ముగ్గు మధ్యలో తెల్లని దుస్తుల్లో వున్న రైతు రైతుబంధు పాసుబుక్కులు పట్టుకుని నిల్చున్నట్టు ముగ్గు వేశారు. చాలా మందిని ఈ ముగ్గు ఆకర్షిస్తోంది. రైతుల మీద ప్రభుత్వం ఆపన్నహస్తాన్ని ఇలా ప్రదర్శించారు ఆమె.

రైతుబంధు పథకం కింద ఇప్పటి వరకు ఎకరాకు సంవత్సరానికి రూ. 4 వేల పంట పెట్టుబడి సాయాన్ని అందించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ. 5 వేల చొప్పున అందజేయనుంది తెలంగాణ సర్కార్.

Telugu news Telangana Raithuibandhu scheme in Sankranthi muggu