తెలంగాణలో పద్మావతిని నిషేధించండి.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో పద్మావతిని నిషేధించండి..

November 21, 2017

‘పద్మావతి’ సినిమాను తెలంగాణలోనూ నిషేధించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వున్న ఈ సినిమాను తెలంగాణ రాష్ట్రంలో విడుదల కాకుండా ఆపాలని లేఖలో కోరీరు. ఇప్పటికే ఈ సినిమాను బీజేపీ పాలిత  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టు సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. చరిత్రను వక్రీకరించి ఈ సినిమాను తీశారని రాజ్‌పుత్ కర్ణిసేన కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుతోనే సినిమాను నిషేధించినట్టు చౌహాన్ తలిపారు.

రోజురోజుకూ సినిమా మీద వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. మద్దతు ప్రకటించేవారూ ఎక్కువయ్యారు. తాజాగా కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ మద్దత్తు తెలిపారు. కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ట్విట్టర్లో తమ మద్దతు పలికా.