తెలంగాణ యువ నాటకోత్సవం - 2 - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ యువ నాటకోత్సవం – 2

October 12, 2017

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య ( తెర ) సంయుక్త నిర్వహణలో నాటకోత్సవం మొదలు కానుంది. ‘ తెలంగాణ యువ నాటకోత్సవం 2 ’ పేరుతో అక్టోబర్ 20, 21, 22 తేదీలలో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రవీంద్ర భారతి వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. నాటక రంగాన్ని ప్రోత్సహించి ముందుకు నడపాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ధ్యేయమని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకు మామిడి హరికృష్ణ తెలిపారు.

20 వ తేదీన అంధకార నగరం, సందేశం, ఇంటర్యూ, 21 వ తేదీన మట్టవ్వ, వినాశి, స్వామి కళ్యాణం

22 వ తేదీన ఊసరవెల్లి, అన్నదాత సుఖీభవ, సర్దార్ సర్వాయి పాపన్న

మొదలగు నాటకాల ప్రదర్శనలు వుంటాయి.