mictv telugu

తెలంగాణలో రేపు ఆటోలు, క్యాబ్‌లు బంద్

January 7, 2019

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మోటార్ వాహనాల సవరణ బిల్లు-2018ని నిరసిస్తూ రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు రేపు ఆటో, క్యాబ్ కార్మిక సంఘాలు బంద్‌కు, ఎల్లుండి నిరసనకు పిలుపునిచ్చాయి. దీంతో తెలంగాణలో ఆటోలు, క్యాబ్‌లపై ఆధారపడి ప్రయాణించేవారికి ఇబ్బంది ఎదురుకానుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్‌ ఐకాస కన్వీనర్‌ మహమ్మద్‌ అమానుల్లాఖాన్‌, ఏఐటీయూసీ నేత బి.వెంకటేశం  బంద్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.Telugu news Telangana tomorrow autos and cabs closedఅనంతరం మీడియాతో మాట్లాడారు. తమపై కేంద్రం మోటార్ వాహనాల బిల్లును బలవంతంగా రుద్దుతోందని పేర్కొన్నారు. ఈ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రైవేటు ఫైనాన్షియర్ల దోపిడీని అరికట్టాలని కోరారు.
ఈ నేపథ్యంలోనే రేపు ఆటోలు, క్యాబ్‌ల బంద్‌తో పాటు ఎల్లుండి నిరసనకు పిలుపునిచ్చినట్టు చెప్పారు.