మాంసాహార ప్రియుల్లో దేశంలోనే తెలంగాణ టాప్ - MicTv.in - Telugu News
mictv telugu

మాంసాహార ప్రియుల్లో దేశంలోనే తెలంగాణ టాప్

February 24, 2018

జేబుల నిండ పైసలు ఉండాలె గాని తెలంగాణోల్లు కౌసు కూర తినాలని ఉవ్వీళ్ళూరుతుంటరు. చికెన్లు, మటన్లు, చేపలు దినాం పెట్టినా యాష్టవడకుంట తింటరు. బొక్క నమలంది, చియ్య కొర్కంది తెలంగాణ పబ్లిక్‌కు బుక్క దిగదని కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెన్ యూనివర్సిటీ ( కేవీఏఎఫ్‌ఎస్ ) డైరెక్టర్ నదీమ్ ఫిరోజ్ అన్నారు. ఈయన బాగనే తెలంగాణోల్ల మీద దృష్టి పెట్టినట్టున్నడు. మాంసాహారం తినేటోళ్ళల్ల తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంల ఉందని అన్నారు. హైదరాబాద్‌లో వున్న జాతీయ మాంస పరిశోధనా కేంద్రం ( ఎన్‌ఆర్‌సీ ఆన్ మీట్ ) 11వ వార్షికోత్సవానికి ఫిరోజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పై విధంగగా మాట్లాడారు.

పెరుగు, నెయ్యి, పన్నీరు వంటి పాల ఉత్పత్తుల ద్వారా ఆదాయం పెరుగుతుందని, పాడి రైతులు వీటిపై దృష్టి సారించాలని నదీమ్ ఫిరోజ్ సూచించారు. గతంతో పొలిస్తే మాంసాహారం తినే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. శరీరానికి ప్రొటీన్స్ కావాలంటే మాంసాహారం, గుడ్లు, పాలు, చేపలు తినాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ డైరెక్టర్ ఛటర్జీ , ప్రిన్సిపల్ సైంటిస్ట్ బర్‌బుద్దే, డాక్టర్ నదీమ్, డా.జార్జ్ నీలన్, డా.రాజేందర్ రెడ్డి, బయెటెక్నాలజీ, వెటర్నరీ విద్యార్థులు పాల్గొన్నారు.

డాక్టర్ నవీన మాట్లాడుతూ తెలంగాణలో మటన్ అవసరాలకు ప్రతి ఏడాది దాదాపు 90 లక్షల జీవాలు అవసరం కాగా అందులో కేవలం మూడో వంతు ( 30 లక్షలు ) మాత్రమే రాష్ట్రంలో లభ్యమవుతున్నాయన్నారు.   తెలంగాణాలో జీవాల పెంపకాన్ని వాణిజ్యపరంగా చేపట్టడానికి విస్తృతమైన అవకాశాలున్నాయని, రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు.