ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే హవా... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే హవా…

October 5, 2018

సీ-ఓటర్ సర్వే తెలంగాణ రాజకీయాలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తెలంగాణలో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు దాదాపు 35 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే 2 సీట్లు తగ్గుతాయని సర్వే అంటోంది. కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో రెండే సీట్లు గెలిచినప్పటికీ టీడీపీ, ఇతర పార్టీల కూటమితో లాభపడి ఈసారి ఆరు సీట్లు గెలవనుందని సర్వే పేర్కొంది.

TRS Wind in Telangana

సీట్లు ఎవరెవరికి ఎన్ని…

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. వాటిలో.. టీఆర్‌ఎస్‌కు 9

కాంగ్రెస్‌కు 6

బీజేపీకి 1

ఎంఐఎంకు 1

టీఆర్ఎస్‌కే అధిక సీట్లు…

టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తుందని చెబుతూనే బీజేపీ, ఎంఐఎంలకు ఒక్కొక్క సీటుతోనే సరిపెట్టింది ఈ సర్వే. టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని తేల్చేసింది. కాగా 2014లో టీఆర్‌ఎస్‌ 11 స్థానాల్లో గెలుపొందింది. తెలంగాణలో కాంగ్రెస్‌–టీడీపీ, ఇతర పార్టీలు కలిసి ఎన్నికల్లో కూటమిగా పోటీచేయాలని కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే.

2014లో టీడీపీ–బీజేపీ కలిసి పోటీ చేయగా ఇరు పార్టీలూ చెరో సీటును గెలిచాయి. ఇటీవలే ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చిన విషయం తెల్సిందే.