ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో సత్తాచాటిన తెలంగాణ యువతి! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో సత్తాచాటిన తెలంగాణ యువతి!

February 24, 2018

ఆస్ట్రేలియాలో జరుగుతున్న జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో తెలంగాణ యువతి అరుణరెడ్డి (22) భారతదేశం తరపున పాల్గొంది. ఈ పోటీల్లో అరుణ కాంస్య పతకం సాధించింది. స్లొవేనియా, ఆస్ట్రేలియా అథ్లెట్లు బంగారు, వెండి పతకాలు సాధించగా అరుణ మూడో స్థానంలో నిలిచింది.

భారత్‌కు చెందిన మరో క్రీడాకారిణి ప్రణతీ నాయక్ ఆరో స్థానంలో నిలిచింది. కాంస్యం సాధించిన అరుణ మాజీ కరాటే బ్లాక్ బెల్ట్ కూడా. ఆమె 2005లోనే తొలి జాతీయ పతకాన్ని సాధించింది. 2014 కామన్‌వెల్త్ గేమ్స్‌లో వాల్ట్ ఆపారేటస్ అర్హత పోటీల్లో 14వ స్థానంతో సరిపెట్టుకుంది. 2010 కామన్‌వెల్త్ గేమ్స్‌లో తొలిసారి ఆవిష్ కుమార్ అనే జిమ్నాస్ట్ కాంస్యం సాధించడంతో  ప్రభుత్వం జిమ్నాస్టిక్స్‌పై దృష్టి సారించింది విషయం తెలిసిందే.