ఐదు జైళ్లు బంద్.. నేరాలు తగ్గాయట.. - MicTv.in - Telugu News
mictv telugu

ఐదు జైళ్లు బంద్.. నేరాలు తగ్గాయట..

February 6, 2018

రోజూ ఎక్కడో ఒకటో హత్యలు, ఆత్మహత్యలు, బెదిరింపులు.. మరెన్నో ఘోరాలు, నేరాలు. మరోపక్క జైళ్లలో తగ్గుతున్న ఖైదీల సంఖ్య.. అయితే రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందంటున్నాయి గణాంకాలు. తెలంగాణలో నేరస్తుల సంఖ్య తగ్గిందని ,అందుకే ఐదు సబ్ జైళ్లను మూసివేస్తున్నట్టు డీజీ వీకే సింగ్ తెలిపారు.

ఒకరు లేదా ఇద్దరు ఖైదీలు ఉండడంతో ఆర్మూర్, బోధన్, నర్సంపేట, పరకాల, మధిరలోని సబ్ జైళ్లను మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు.  సబ్ జైళ్ల స్థానంలో పరిశ్రమలు,విద్యా సంస్థలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఖైదీలో ప్రవర్తనలో మార్పు రావడంతో రాష్ట్రంలో నేరాలు తగ్గుతున్నాయని తెలిపారు. తెలంగాణ జైళ్లలో 2014లో ఖైదీల సంఖ్య 6012. 2018 జనవరికి  ఖైదీల సంఖ్య 5,348 మంది ఉన్నారు.