ఏటీఎంలలో  ‘నో క్యాష్’.. కారణం అదే - MicTv.in - Telugu News
mictv telugu

ఏటీఎంలలో  ‘నో క్యాష్’.. కారణం అదే

April 17, 2018

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఏటీఎం  సెంటర్‌లలో ‘నోక్యాష్ ’ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. డబ్బులున్న ఒకటి ,రెండు ఏటీఎంల ముందు ప్రజలు క్యూలైన్‌లలో  నిల్చొని అవస్థతలు పడుతున్నారు. 2016 నవంబర్‌లో నోట్ల రద్దు తరువాతి పరిస్థితిని ప్రజలు ఎదరుక్కుంటున్నారు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర  అవస్థలు పడుతూ,బ్యాంకులకు వెళుతుంటే,అక్కడ సైతం అడిగినంత డబ్బు ఇవ్వకుండా కోత విధిస్తున్నారు.దీంతో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.బ్యాంకు అధికారులు మాత్రం ఇటీవల కాలంలో వరుసగా సెలవులు రావడంతో ఈ ఇబ్బంది కలిగిందని చెబుతున్నారు. మరోవైపు రూ. 2 వేల నోట్లు తిరిగి డిపాజిట్ కావడం లేదని చెబుతున్నారు. రద్దయిన నోట్ల స్థానంలో 80 శాతం కరెన్సీని కొత్త నోట్ల రూపంలో విడుదల చేసినప్పటికీ, అవి పూర్తి స్థాయిలో సర్క్యులేట్ కావడం లేదని వెల్లడించారు. తాము పక్క రాష్ట్రాల నుంచి కూడా డబ్బును తెప్పించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయత్నిస్తున్నామని, అతి త్వరలోనే ఏటీఎంలలో క్యాష్ నింపే ప్రయత్నం చేస్తామని అధికారులు  తెలిపారు.