ఎంసెట్ షెడ్యూల్ విడుదల... - MicTv.in - Telugu News
mictv telugu

ఎంసెట్ షెడ్యూల్ విడుదల…

February 26, 2018

ఇంజినీరింగ్ , వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌ను  తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి  సోమవారం ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు పరీక్షకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా లోనికి ప్రవేశం అనుమతించబోమని తెలిపారు. ఈ నిబంధన విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి కాదని, కేవలం క్రమశిక్షణ కోసమేనని తెలిపారు. పరీక్ష10 గంటలకు అయితే విద్యార్థులు 9 గంటలకే సిద్దం అయి ఉంటే ఎలాంటి సమస్యలు రావు అని అన్నారు. ఎంసెట్‌కు పరీక్షను తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారని పేర్కొన్నారు.

ఎంసెట్‌  షెడ్యూల్…

ఫిబ్రవరి 27న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

మార్చి 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం

ఎంసెట్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్‌ 4

మే 2, 3 తేదీల్లో ఎంసెట్‌ మెడికల్‌ పరీక్ష

మే 4, 5, 7 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష