మెడికల్ విద్యార్థులకు కేసీఆర్ తీపి కబురు - MicTv.in - Telugu News
mictv telugu

మెడికల్ విద్యార్థులకు కేసీఆర్ తీపి కబురు

March 8, 2018

తెలంగాణ ప్రభుత్వం పీజీ పూర్తి చేసిన మెడికల్ విద్యార్థులకు శుభవార్తను మోసుకొచ్చింది. పీజీ పూర్తి చేసిన తర్వాత మెడికల్ విద్యార్థులు కచ్చితంగా ప్రభుత్వం దవాఖానాలో ఏడాది పాటు విధులను నిర్వహించాలన్న నింబంధనను తొలగిస్తున్నట్లు  ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రకటించారు. ఈ నిబంధన రద్దుకు సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ నిర్ణయం ఏడాది నుంచే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయకున్నా వారి విద్యార్హతను  రిజిస్టర్ చేసి సర్టిఫికేట్లు ఇవ్వాల్సి ఉంటుంంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చాలినంత సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికనే నియమిస్తున్నామని, మెడికల్ విద్యార్థులతో పని చేయించాల్సిన అవసరం లేదని  తెలిపారు.