పెట్రోల్‌ బంకుల్లో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి.. - MicTv.in - Telugu News
mictv telugu

పెట్రోల్‌ బంకుల్లో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి..

March 24, 2018

ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఉపాధిని కల్పించడానికి నడుం బిగించింది. త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్న పెట్రల్ బంకుల్లో వారికి జీవనోపాధిని కల్పించనుంది. ఐదు పెంట్రోల్ బంకుల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించడం ప్రత్యేకం. వారికి ఉపాధి కల్పిచడంవల్ల సమాజంలో గౌరవంగా జీవించగలని అధికారులు భావించారు.

ఈ ఏడాది చివరి నాటికి జైళ్లశాఖ రాష్ట్రంలో మొత్తం వంద పెట్రోల్ పంపులను నిర్వహించాలని నిర్ణయించుకుంది. వాటిలో ఐదింటిని ట్రాన్స్‌జెండర్ల కోసం  కేటాయించింది. జైళ్లు-పరివర్తన సేవల డైరెక్టర్ జనరల్ వీకే. సింగ్ మీడియాతో మాట్లాడుతూ… నగరంలోని ట్రాన్స్‌జండర్లకు పునరావాసంతో పాటు ఉపాధిని కల్పించనున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే వారికి పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. మరోవైపు జైలు ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తుల విక్రయం కోసం త్వరలోనే వెయ్యి విలేజ్ అవుట్‌లెట్లను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.