శివుడితో పెళ్లి.. శ్రీరామనవని వేడుకల్లో ట్రాన్స్‌జెండర్లు   - MicTv.in - Telugu News
mictv telugu

శివుడితో పెళ్లి.. శ్రీరామనవని వేడుకల్లో ట్రాన్స్‌జెండర్లు  

March 26, 2018

శ్రీరామనవమి పర్వదినం సందర్బంగా రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ట్రాన్సజెండర్లు  సందండి చేశారు. ట్రాన్స్ జెండర్లు వధువుగా అలంకరించుకుని సీతారాముల విగ్రహాలపై తలంబ్రాలు చల్లారు. ఆనంతరం ఒకరి తలపై మరొకరు అంక్షింతలు చల్లుకున్నారు.ఈ సందర్బంగాఈ ఏడాది కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు. శనివారం రాత్రి నుంచే తెలంగాణతో పాటు , కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తులు తొలుత ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.  శివుడిని పెళ్లి చేసుకునేందుకు భక్తులు వధువుల మాదిరిగా అలంకరణ చేసుకున్నారు. చేతిలో త్రిశూలం ధరించారు. ఈ వివాహ వేడుకను ఆలయ ప్రధాన అర్చకుడు గోపన్నగారి శంకరయ్య పర్యవేక్షించారు. ఆలయ ఈఓడి.రాజేశ్వర్ దంపతులు, నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ నామాల ఉమతో పాటు ట్రాన్స్‌జెండర్లు కూడా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు.