ఫోన్ నంబర్లలో ఇక 13 అంకెలు.. సర్కారు ఆదేశాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్ నంబర్లలో ఇక 13 అంకెలు.. సర్కారు ఆదేశాలు..

February 21, 2018

త్వరలో దేశంలోని మొబైల్ ఫోన్ నంబర్లన్నీ మారిపోనున్నాయి. ప్రతి ఫోన్‌ నంబర్ 13 అంకెల ఫార్మాట్‌లోకి మారిపోతుంది. ఈమేరకు జూలై 1 నుంచి సంబంధిత ప్రక్రియ మొదలు పెట్టాలని టెలికం విభాగం.. టెలికం కంపెనీలను ఆదేశించింది. వినియోగదారులకు ఉత్త‌మ సెక్యూరిటీ ఫీచ‌ర్లు అందించ‌డానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.  

పెరుగుతున్న మొబైల్ వినియోగదారుల కనెక్షన్లకు, డేటా భద్రతకు వీలుగా ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్‌లో ఇప్ప‌టికే ఈ దిశ‌లో క‌స‌ర‌త్తు ప్రారంభించింది.

13 అంకెల ప్ర‌క్రియ జూలై‌లో మెదలై  2018 అక్టోబ‌ర్ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసేందుకు డిసెంబ‌రు 31, 2018ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. టెలికం శాఖ నుంచి జ‌న‌వ‌రి 8, 2018న ఈ ప్ర‌క్రియ‌కు సంబంధించిన ఆదేశం వ‌చ్చింద‌ని, అప్ప‌టి నుంచి తాము క‌స‌ర‌త్తు ప్రారంభించామ‌ని బీఎస్ఎన్ఎల్ సంస్థ  సీనియ‌ర్ అధికారి ఒక‌రు చెప్పారు.