తెలుగు మహాసభలు కాదు దోపిడి వర్గాల మహాసభలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు మహాసభలు కాదు దోపిడి వర్గాల మహాసభలు

December 7, 2017

కష్టజీవులకు ఇరువైపులా ఉండేవాళ్లే నిజమైన కవులని, పాలకవర్గాల పల్లకి మోసే వాళ్లు కవులు కాదంటుంది విప్లవ రచయితల సంఘం.ఆంధ్రాతెలుగు, తెలంగాణ తెలుగు ఒకటి కాదన్న వాళ్లు ఇప్పుడు తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నారని విమర్శించింది.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమైన విరసం, తెలుగు మహాసభలను కచ్చితంగా అడ్డుకుంటామంది. కిరణ్ కుమార్ రెడ్డి సమయములో తెలుగు మహాసభలను పెడితే బహిష్కరించిన వాళ్లు, వెంకయ్యనాయుడు,చంద్రబాబులను పిలవడం సిగ్గుచేటన్నారు. పేదలను దోచుకోవడానికి ఎలా అయితే  GEC సదస్సు జరిగిందో అట్లనే ఇప్పుడు ప్రపంచ తెలుగు మహా సభలు జరుగుతున్నాయని ఆరోపించింది.

ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు, జర్నలిస్టుల పై దాడులు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య పై దాడులు రోహిత్ వేముల ఆత్మహత్య ల విషయంలో పెట్టుబడిదారులకు మధ్యవర్తిగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిందని విరసం ఆరోపించింది.